- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపటికి వాయిదా
ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC) మెరిట్ జాబితాను విద్యాశాఖ అధికారులు శుక్రవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మెగా డీఎస్సీ (AP Mega DSC) మెరిట్ జాబితాను విద్యాశాఖ అధికారులు శుక్రవారం రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ లిస్ట్‌ను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను కూడా అందజేశారు. వాస్తవానికి కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియపై మెగా డీఎస్సీ కన్వీనర్ కీలక ప్రకటన చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి జరగాల్సిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని విద్యా శాఖ అధికారులు సూచించారు.






