- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ అప్డేట్
by Gantepaka Srikanth |
ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్(AP Constable) తుది రాత పరీక్ష ఫలితాలు రేపు(మంగళవారం) విడుదల కాబోతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్(AP Constable) తుది రాత పరీక్ష ఫలితాలు రేపు(మంగళవారం) విడుదల కాబోతున్నాయి. ఫలితాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత(Home Minister Anita) విడుదల చేయనున్నారు. కాగా, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో నిలిపివేశారు. ఇప్పటికే శారీరక సామర్థ్యం, రాత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాల పరిశీలనతో పాటు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. 2022 అక్టోబర్‌లో కానిస్టేబుల్ పరీక్షలు జరిగాయి. తాజాగా న్యాయ వివాదాలు అన్నీ క్లియర్ కావడంతో రేపు ఫలితాలు విడుదల చేయబోతున్నారు.
Next Story






