అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేడు DSC ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-15 01:54:54  IST  )

మెగా డీఎస్సీ (Mega DSC) ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇవాళ విడుదల చేయనున్నట్లుగా డీఎస్సీ కన్వీనర్‌ వెంకట‌కృష్ణారెడ్డి (Venkat Krishna Reddy) వెల్లడించారు.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నేడు DSC ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డీఎస్సీ (Mega DSC) ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇవాళ విడుదల చేయనున్నట్లుగా డీఎస్సీ కన్వీనర్‌ వెంకట‌కృష్ణారెడ్డి (Venkat Krishna Reddy) వెల్లడించారు. ఉదయం 9.30కి విద్యా శాఖ ఆధ్వర్యంలో తుది ఎంపిక జాబితాను జిల్లా విద్యాధికారి, కలెక్టర్‌ కార్యాలయాలు, మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఉంచనున్నామని ప్రకటించారు. కాగా, మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 20న ప్రకటన విడుదల చేశారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించగా... జూన్‌ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సంబంధించి జులై 5న ప్రైమరీ కీ విడుదల చేయగా.. ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేశారు. టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చామని, అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి అయిన విషయం తెలిసిందే.

Next Story