- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో డీఎస్సీ-2025 మెరిట్ లిస్ట్ విడుదల
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో ఏపీ మెగా డీఎస్సీ-2025 (AP Mega DSC-2025) మెరిట్ జాబితాను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో ఏపీ మెగా డీఎస్సీ-2025 (AP Mega DSC-2025) మెరిట్ జాబితాను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఆ మెరిట్ జాబితాను www.apdsc.apcfss.in అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), లాంగ్వేజ్ పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) నియామక పరీక్షకు హాజరైన అభ్యర్థులు జిల్లా వారీ పీడీఎఫ్ మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాక తర్వాత చెక్ చేసుకొవచ్చు. ఈ సంవత్సరం AP DSC నియామకం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 16,347 పోస్టులు భర్తీ చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థుల పేర్లు, రోల్ నెంబర్లు, కేటగిరీల, పొందిన మార్కులు, మెరిట్ ర్యాంకులతో కూడిన మెరిట్ జాబితా ప్రతి జిల్లాకు ప్రత్యేక పీడీఎఫ్‌గా పబ్లిష్ చేయనున్నారు.
కాగా, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నారు. అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు ఫొటోలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్‌లిస్టును వెబ్‌సైట్‌లో అధికారులు పెట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా.. సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి, ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు.






