అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |

ఎప్పుడుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాసిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. కాసేపట్లో కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాసిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుల చేయనున్నారు. వాస్తవానికి రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సి ఉండగా.. తుది జాబితాను బోర్డు మరోసారి పరిశీలించాలని నిర్ణయించడంతో ఇవాళ్టికి వాయిదా వేశారు. కాగా, ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 5,03,487 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు. అయితే, కానిస్టేబుల్ పరీక్షను వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 అక్టోబర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాల కారణంగా తుది ఫలితాలను విడుదల చేయలేదు.

Next Story