- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ సంప్రదాయానికి భువనేశ్వరే కారణం’.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల జీవితంలో ఈ సంక్రాంతి పండుగ(Sankranti Festival) కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పండగ సమయంలో ఊరెళ్లి అందరితో సంతోషంగా గడపాలని అందుకే తాను ప్రతి సంక్రాంతికి ఊరికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇన్ని రోజులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు ఎక్కడెక్కడో ఉండి పనులు చేసుకుంటూ బీజీ జీవితాన్ని గడుపుతుంటారు.
ఈ క్రమంలో పండగ సమయంలో అయినా ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవడం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ‘నేను ప్రతి సంక్రాంతికి మా ఊరికి వెళ్తాను. ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే(Nara Bhuvaneswari) కారణం. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం, మాట్లాడుకోవడం ఎంతో అవసరం. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ పండుగ సంతోషంగా జరుపుకోవాలి’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.






