- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కూతురు పెళ్లికి చంద్రబాబు తమ్ముడు, బాలకృష్ణ వచ్చారు: భూమన కరుణాకర్ రెడ్డి
తన కూతురు పెళ్లికి చంద్రబాబు తమ్ముడితో పాటు నందమూరి బాలకృష్ణ వచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: తన కూతురు పెళ్లికి చంద్రబాబు తమ్ముడితో పాటు నందమూరి బాలకృష్ణ వచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) అన్నారు. భూమన తన కుమార్తెకు క్రిస్టియన్‌తో పెళ్లి చేశారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తిరుపతి(Tirupati)లో మీడియాతో మాట్లాడుతూ తాను తన కూతురికి క్రిస్టియన్ మతం(Christianity) ప్రకారం పెళ్లి చేశానని చంద్రబాబు అన్నారని, కాని తన కూతురు పెళ్లిని తిరుచానూరు లో 30 వేలమంది సమక్షంలో చేశానని భూమన స్పష్టం చేశారు. అందులో చంద్రబాబు తమ్ముడు కూడా ఉన్నారని గుర్తు చేశారు. పెళ్ళికి లోకేశ్ మామ బాలకృష్ణ కూడా వచ్చారని చెప్పారు. హిందూ సాంప్రదాయ ప్రకారం తన కూతురు పెళ్లి చేశానని భూమన వ్యాఖ్యానించారు. ‘‘ఆలయ ప్రధాన అర్చకులు, వేదాపారాయణ దారులు వచ్చి ఆశీర్వదించారు. చంద్రబాబు ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు చాలా చేతిలో బైబిల్ పట్టుకున్నారు.. మరి మీరు హిందువా?. పవన్ కల్యాణ్ మూడవ భార్య క్రిస్టియన్ కదా, మరి వారిని క్రిస్టియన్ అని ఎందుకు అనరు.’’ అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన ప్రశ్నించారు.






