బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందే: భూమన డిమాండ్

by Vemula.Srinu Prasad |

బీఆర్ నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.

బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందే: భూమన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ నాయుడు(Br Naidu)ని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devastanam) అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందేనని మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరణ్ రెడ్డి(YSRCP leader Bhumana Karunakaran Reddy) డిమాండ్ చేశారు. మహిళలను లైంగింకంగా వేధించినందుకు తాము ఈ డిమాండ్ చేస్తున్నామని, ఇందులో భాగంగా తిరుపతి పట్టణంలో శనివారం నిరసన వ్యక్తం చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నాయి. అయితే ఇది ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేసే కార్యక్రమం కాదని తెలిపారు. కేవలం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించే కార్యక్రమం మాత్రమేనన్నారు. ఇలాంటి శాంతియుత కార్యక్రమానికి కూడా తిరుపతి పోలీసులు సెక్షన్ 30 అమలులోకి తెచ్చి పార్టీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిధిలో ప్రశాంత వాతావరణంలో భక్తి భావంతో పూజలు నిర్వహించడం తప్ప మరే ఇతర కార్యక్రమం మా ఉద్దేశంలో లేదని తెలిపారు. అందువల్ల శనివారం కార్యక్రమం ముందుగా నిర్ణయించిన విధంగానే శాంతియుతంగా కొనసాగుతుందని పార్టీ శ్రేణులకు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story