ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణలు జరగనున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత..

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణలు జరగనున్న నేపథ్యంలో హోంమంత్రి అనిత ఆలయ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. మాల విరమణ చేసి, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

డిసెంబర్ 11వ తేదీన భవానీ భక్తుల దీక్షల విరమణ ప్రారంభమవుతుందన్నారు. 15వ తేదీ వరకూ విరమణలు జరగనున్న క్రమంలో.. దాదాపు 6 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ 9 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ అనంతరం దుర్గమ్మను భవానీలు దర్శించుకుంటారని తెలిపారు. భవానీల దీక్ష విరమణ నేపథ్యంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండ చేతికి స్కానర్ ట్యాగ్ పెడుతున్నామని, ప్రసాదాలకు లోటు లేకుండా 60 లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. నిత్యాన్నదానంలో ఎలాంటి లోటు ఉండదన్నారు.

Next Story