- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఏపీ బిజెపి చీఫ్
by Thanuru Gopichand |
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర యంత్రాంగానికి ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ విజ్ఞప్తి చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర యంత్రాంగానికి ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో పలువురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ సహకారాలు అందించాలని కర్నూలు జిల్లా బిజెపి నేతలను ఆదేశించారు. క్షతగాత్రుల కుటుంబాలకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించి వారి కుటుంబ సభ్యులను బాధితుల వద్దకు చేర్చే ప్రయత్నం చేయాలని సూచించారు. మృతుల పోస్ట్ మార్టం పూర్తి చేయించడానికి యంత్రాంగాన్ని సమన్వయపరచుకోవాలని కోరారు. అదే విధంగా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు.
Next Story






