- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లె ఘటన మరవకముందే రాష్ట్రంలో మరో దారుణం.. విశాఖలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
by Ajay Maddhiboyina |
విశాఖపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై యోగి అనే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. పెదగంట్యడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడు తినుబండారాలు కొనిస్తానని చెప్పి చిన్నారిని తీసుకునివెళ్లినట్టు తెలుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె బాలిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల బాలికపై ఇంటిముందు నివాసం ఉండే కులవర్ధన్ అనే మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన తరవాత పోలీసుల నుండి తప్పించుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన జరిగి రెండు రోజులు కూడా అవ్వకముందే విశాఖపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై యోగి అనే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. పెదగంట్యడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడు తినుబండారాలు కొనిస్తానని చెప్పి చిన్నారిని తీసుకునివెళ్లినట్టు తెలుస్తోంది. బాలిక ఏడవడంతో గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు.
Next Story






