- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళ్లపారాణి ఆరకముందే: సముద్రంలో స్నానానికి వెళ్లిన నవదంపతులు గల్లంతు
నెల రోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో : నెల రోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు. ఇంటి దగ్గర పెళ్లిపందిరిలు సైతం ఇంకా తియ్యనే లేదు. అయితే ఆ పెళ్లింట విషాదం నెలకొంది. నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది. బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు.దీంతో ఇరు కుటుంబ సభ్యులు విషాదంలో నెలకొన్నారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన రేలంగి లక్ష్మీనారాయణ (27)కు ఏలూరు జిల్లా కలిదిండి మండలం గురవయ్యపాలెం వాసి నాగ గాయత్రి (23)తో గత నవంబరు 1న వివాహం జరిగింది. అయితే వరుడు లక్ష్మీనారాయణ భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో లక్ష్మీనారాయణ తన సతీమణి నాగ గాయత్రితో కలిసి విహార యాత్రకు అంతర్వేది వచ్చారు. అయితే బీచ్‌లో స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. దీంతో ఇరుకుటుంబాల సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నవదంపతుల ఆచూకీ కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.






