పోలీస్ శాఖలో ఆసక్తికర పరిణామం.. పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసిన డీఎస్పీకి ప్రతిష్టాత్మక అవార్డు

by Vemula.Srinu Prasad |

పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసిన డీఎస్పీ జయసూర్యకు కేంద్రం నుంచి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది..

పోలీస్ శాఖలో ఆసక్తికర పరిణామం.. పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేసిన డీఎస్పీకి ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పోలీస్ శాఖ(Ap Police Department)లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఎస్పీ(Sp)కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఫిర్యాదు చేసిన భీమవరం డీఎస్పీ(Beemavaram Dsp)కి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. డెడ్ బాడీ డెలివరీ కేసు విషయంలో ఆయనతో పాటు మరో ముగ్గురికి కేంద్రం అవార్డు ప్రకటించింది. సమర్థవంతులుగా గుర్తిస్తూ ఏలూరు జిల్లా నుంచి నలుగురు పోలీసులకు పురస్కారం లభించింది. కేంద్ర హోం శాఖ నుంచి ఎస్పీ నయీమ్, ఏసీబీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, ఎస్సై నజీరుల్లా అవార్డు అందుకున్నారు. ఈ మేరకు వారిని కేంద్రం అభినందించింది.

కాగా పేకాట క్లబ్బుల విషయంలో భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఆ జిల్లా ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. దీంతో జయసూర్య తీరుపై రాష్ట్ర హోంశాఖ పరిశీలన చేస్తామని తెలిపింది. ఈ లోపే డీఎస్పీ జయసూర్యకు కేంద్రం నుంచి అవార్డు దక్కడం చర్చనీయాంశంగా మారింది.

Next Story