- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో షాకింగ్ ఘటన.. కోల్డ్ స్టోరేజ్‌లో బయటపడ్డ లక్ష కేజీలకు పైగా గోమాసం
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని శొంఠ్యం శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో భారీగా గోమాంసం నిల్వలు బయటపడ్డాయి. సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించిన DRI అధికారులు 1 లక్షా 89వేల కేజీల గోమాంసాన్ని సీజ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని శొంఠ్యం శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజీలో భారీగా గోమాంసం నిల్వలు బయటపడ్డాయి. సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించిన DRI అధికారులు 1 లక్షా 89వేల కేజీల గోమాంసాన్ని సీజ్ చేశారు. ఈ కోల్డ్ స్టోరేజ్ బాపట్లకు చెందిన గుప్తా అనే వ్యాపారిది అని సమాచారం అందుతోంది.
మాంసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపి నివేధికలు వచ్చిన తరవాత ఆనందపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండున్నర నెలలుగా స్టోరేజ్ లో గోమాంసాన్ని నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది. అయితే నిర్వాహకులు మాత్రం కోల్డ్ స్టోరేజీలో గోమాంసం ఎవరు నిల్వ చేశారో తెలియదు అంటూ సమాధానం ఇస్తున్నారు. భారీ స్థాయిలో నిల్వలను గుర్తించడంతో ఎక్కడికైనా ఎగుమతి చేసేందుకు మాంసాన్ని నిల్వ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






