- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడి పై ఎలుగుబంటి దాడి
by Jakkula.Mamatha |
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది

X
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం బోరేపల్లి గ్రామంలో ఓ యువకుడి పై ఎలుగుబంటి దాడి చేసింది. ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో గాయపడ్డ ఆ యువకుడిని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.
ఎలుగుబంటి(Bear) దాడి ఘటన పై గ్రామస్తులు భయాందోళన(Panic)కు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో చిరుత సంచారం.. నేడు ఎలుగుబంటి ఇలా వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్న ఘటనలు గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ తరుణంలో అటవీశాఖ(Forest Department) అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని గ్రామంలోకి అడవి జంతువులు రాకుండా చూడాలని, తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






