- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక గోవా బీచ్‌ల మాదిరిగా వైజాగ్ బీచ్
టూరిజంపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర టూరిస్ట్ ప్లేస్ లను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టూరిజంపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర టూరిస్ట్ ప్లేస్ లను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోవా స్టైల్ బీచ్ షాక్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా బీచ్ లలో మద్యం సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వైజాగ్ బీచ్ తో పాటు చీరాల బీచ్ లలో తాత్కాలిక బీచ్ ఫ్రంట్ బార్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మద్యంతో పాటు సీఫుడ్, స్నాక్స్ ఇతర ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ స్టాల్స్ తెరిచి ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇలా బీచ్ లలో బార్లు ఏర్పాటు చేయడం వల్ల టూరిజం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోవాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది బీచ్ లలో చిల్ అయ్యేందుకే వెళుతుంటారు. ఇప్పుడు వైజాగ్, చీరాలలోనూ బీచ్ ఫ్రంట్ బార్లు తీసుకురావడం వల్ల చాలా మంది పార్టీల కోసం, సాయంత్రం పూట ఎంజాయ్ చేసేందుఉ బీచ్ లకు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల విదేశీయులు సైతం ఆకర్షితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి.






