Beach Festival : మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్.. 2k రన్ లో పాల్గొన్న బైరవం టీం

by Muthe.Rajitha |

మచిలీపట్నం(Machilipatnam)లో మసూల బీచ్ ఫెస్టివల్(Beach Festival) అంగరంగ వైభవంగా మొదలైంది.

Beach Festival : మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్.. 2k రన్ లో పాల్గొన్న బైరవం టీం
X

దిశ, వెబ్ డెస్క్ : మచిలీపట్నం(Machilipatnam)లో మసూల బీచ్ ఫెస్టివల్(Beach Festival) అంగరంగ వైభవంగా మొదలైంది. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌(Manginapudi Beach)లో జూన్ 5 నుంచి 8 వరకు మసూలా బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్ట్ లో భాగంగా నేడు 2K రన్ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్ లో భైరవం సినిమా టీం(Bhairavam Movie Team) పాల్గొంది. ఈ రన్‌ను ఫెస్టివల్ ప్రచారం కోసం నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో భైరవం సినిమా నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్ నారాతో సహా టీం సభ్యులు పాల్గొన్నారు.

ఫెస్టివల్‌లో బీచ్ వాలీబాల్, హెలికాప్టర్ రైడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్ట్‌లు, మామిడి పళ్ల ప్రదర్శన, 100 అడుగుల దోసె వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్‌ను కృష్ణా జిల్లా అధికారులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ మచిలీపట్నంను టూరిజం హబ్‌గా మార్చే లక్ష్యంతో జరుగుతోంది.

Next Story