- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ ఫేక్ ప్రచారం మానుకో.. దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చిద్దాం : మంత్రి సవిత సవాల్
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం క్రెడిట్ మొత్తం సీఎం చంద్రబాబుదేనని, జగన్ ఫేక్ ప్రచారం మానుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం క్రెడిట్ మొత్తం సీఎం చంద్రబాబుదేనని, జగన్ ఫేక్ ప్రచారం మానుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. జగన్ కు దమ్ముంటే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడంపైనా అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. తన నీలి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని, పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని జగన్ మంత్రి సవిత హెచ్చరించారు. ఇవాళ విజయవాడలోని గొల్లిపూడి బీసీ భవన్ లో బెస్త కార్పొరేషన్, షేక్ కార్పొరేషన్ పాలక మండళ్ల ప్రమాణ స్వీకారలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ అంతా టీడీపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబునేని తేల్చి చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది కూడా సీఎం చంద్రబాబేనన్నారు. శనివారం భోగాపురం ఎయిర్ పోర్టు విమానం ల్యాండ్ అయ్యిందని, ఉత్తరాంధ్ర ప్రజల్లో కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని అన్నారు. మరో ఆరు నెలల్లో ఎయిర్ పోర్టు ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.
అసెంబ్లీకి రా చర్చిద్దాం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధంతా తన వల్లేనని జగన్ ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. ఎర్ర బస్సు రాని భోగాపురంలో ఎయిర్ పోర్టు ఎందుకని విమర్శలు గుప్పించిన విషయం జగన్‌కు గుర్తు లేదా..? అని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం సీఎం చంద్రబాబేనంటూ జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఆ ప్రాజెక్టు నిలిచిపోవడానికి జగన్ అసమర్థతే కారణమన్నారు. జగన్ కు దమ్ముంటే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడంపైనా అసెంబ్లీలో చర్చకు రావాలని, సభలో తప్పెవరిదో తేలుద్దామని మంత్రి సవిత సవాల్ విసిరారు.






