ఏపీ హైకోర్టు జడ్జిగా బట్టు దేవానంద్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-16 10:51:22  IST  )

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్(Justice Battu Devanand) నియమితులయ్యారు.

ఏపీ హైకోర్టు జడ్జిగా బట్టు దేవానంద్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్(Justice Battu Devanand) నియమితులయ్యారు. అయితే, జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. బట్టును ఏపీకి బదిలీ చేయాలన్న సుప్రీం కొలీజియం నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఆయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ కాగా.. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా నేడు దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త సీజేఐలు నియమించబడ్డారు. తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్‌కుమార్‌ సింగ్, త్రిపుర హైకోర్టు సీజేగా ఎంఎస్ రామచంద్రరావు, రాజస్థాన్ హైకోర్టు సీజేగా కేఆర్ శ్రీరామ్ నియమితులయ్యారు.

Next Story