బేరం ఫిక్స్ : పవన్ కల్యాణ్ ప్రకటనపై వైసీపీ రియాక్షన్

by Seetharam |   (  Updated:2023-09-14 09:13:32  IST  )

2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బేరం ఫిక్స్ : పవన్ కల్యాణ్ ప్రకటనపై వైసీపీ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించింది. ప్యాకేజీ బంధం బయటపడింది అని అభివర్ణించింది. ‘నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇన్నాళ్లూ నీ మీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు కాస్తూ కూస్తో నిన్ను నమ్మిన వాళ్లకు ఈ రోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు బేరం ఫిక్స్ అంటూ ఓ సెటైరికల్ ఫోటోను సైతం షేర్ చేసింది.

Next Story