AP News : బ్యాంక్ వేధింపులు.. యువకుడు సూసైడ్

by Muthe.Rajitha |

బ్యాంక్ సిబ్బంది తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

AP News : బ్యాంక్ వేధింపులు.. యువకుడు సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్యాంక్ సిబ్బంది తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు తన స్నేహితుడికి డబ్బులు అవసరం ఉండగా.. క్రెడిట్ కార్డు నుంచి ఇచ్చాడు. కాని స్నేహితుడు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బ్యాంక్ సిబ్బంది శ్రీకాంత్ ను డబ్బులు కట్టమని ఫోన్లు చేశారు. ఇటీవల బ్యాంక్ సిబ్బంది ఇంటికి వచ్చి గొడవ పడటంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. కాగా బ్యాంక్ సిబ్బంది వేధించడం వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని యువకుని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story