Nandamuri Balakrishna:‘కచ్చితంగా ఆయనకు భారతరత్న వస్తుంది’.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-03 11:02:48  IST  )

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి నటసింహాం బాలకృష్ణ(Nandamuri Balakrishna) హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ(TDP) గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Nandamuri Balakrishna:‘కచ్చితంగా ఆయనకు భారతరత్న వస్తుంది’.. బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి నటసింహాం బాలకృష్ణ(Nandamuri Balakrishna) హిందూపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ(TDP) గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవల బాలయ్యకు పద్మభూషణ్(Padma Bhushan) వచ్చిన విషయం తెలిసిందే. పద్మభూషణ్ పురస్కారం(Award) పై బాలకృష్ణ మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. తనకు పద్మభూషణ్ రావడం కాదు, నాన్న (Sr.NTR)కు భారతరత్న రావాలన్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం(Union Government) తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు కంటే నాన్నకు(Sr.NTR) భారతరత్న అవార్డు(Bharat Ratna Award) రావాలనేది కోట్లాది మంది తెలుగు ప్రజల కోరిక అని తెలిపారు. ఈ నేపథ్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు కచ్చితంగా వస్తుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. నాన్నకు భారతరత్నను తెలుగు ప్రజలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నాన్నకు భారతరత్న తప్పకుండా వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై తెలుగువారి కల, ఆకాంక్ష. అది ఎప్పటికైనా నెరవేరుతుందని బాలకృష్ణ వెల్లడించారు..

Next Story