- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య కూతురిలో ఇంత టాలెంట్ ఉందా? చూస్తే మతిపోవాల్సిందే
నటసింహం నందమూరి బాలకృష్ణ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగులైనా, నటనలో అయినా, డ్యాన్సులో అయినా అనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగులైనా, నటనలో అయినా, డ్యాన్సులో అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అరవై ఏళ్ల వయసులోనూ ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఇప్పటికీ ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ యువ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే బాలయ్య ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు ఎవరూ సినిమాల్లోకి రాలేదు. ఆయన కుమారుడు మోక్షాజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు ఆ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ రావడంలేదు.
ఇక ఇప్పుడు బాలయ్య కుమారుడి సినిమా పనులు స్లోగా నడుస్తున్నా ఆయన కుమార్తె తేజస్విని మాత్రం తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. అప్పట్లో తేజస్విని ఓ యాడ్ షూట్‌లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె ఓ పాటకు స్టెప్పులు వేయగా నెట్టింట ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇదివరకు ఎప్పుడూ అలా డ్యాన్స్ చేయని తేజస్విని చాలా స్టైలిష్‌గా గ్రేస్‌తో డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చూసి నెటజన్లు ఫిదా అవుతున్నారు. తేజస్వినిలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా తేజస్విని సినిమాల్లోకి వచ్చి ఉంటే ఊపేసేదని కామెంట్లు పెడుతున్నారు.






