పద్మభూషణ్ పై మరోసారి స్పందించిన బాలకృష్ణ.. చాలా మంది అలా అంటున్నారంటూ కామెంట్స్!

by Jakkula.Mamatha |

సినీ రంగానికి చేసిన సేవలకు గాను నందమూరీ బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని(Padma Bhushan award) ప్రకటించిన విషయం తెలిసిందే.

పద్మభూషణ్ పై మరోసారి స్పందించిన బాలకృష్ణ.. చాలా మంది అలా అంటున్నారంటూ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: సినీ రంగానికి చేసిన సేవలకు గాను నందమూరీ బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని(Padma Bhushan award) ప్రకటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌గా బాధ్యతలను చేపట్టి 15 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి సేవ చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నేడు(శుక్రవారం) బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి(Basavatarakam Cancer Hospital)లో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నానని తెలిపారు.

అంతేకాదు 3వ సారి ఎమ్మెల్యేగా గెలుపొందానని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ నాన్న ఆశీర్వాదం అని పేర్కొన్నారు. అయితే.. పురస్కారాలు, బిరుదుల కోసం కాకుండా నిబద్ధతతో మన బాధ్యతలను మనం నిర్వర్తించాలని సినీ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి ఎప్పటికీ రుణపడి ఉండాలి అన్నారు. ఈ క్రమంలో సమాజానికి మనం కూడా సమాజానికి ఏదైనా మంచి చేయాలని సూచించారు.

పద్మభూషణ్ అవార్డు గురించి బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మభూషణ్ ఎప్పుడో రావాలని చాలా మంది అంటున్నారని అన్నారు. కానీ.. ఆలస్యం ఏమీ కాలేదని బాలకృష్ణ తేల్చి చెప్పారు. నాన్నగారి 100వ జయంతి ఇటీవల పూర్తైందని గుర్తుచేశారు. నాన్నగారు నటించిన ‘మన దేశం’ విడుదలై 75 ఏళ్లు అవుతుందన్నారు. తాను ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉంటానని, పూజలు ఎక్కువగా చేస్తుంటానని బాలకృష్ణ తెలిపారు. తనకు పద్మభూషణ్ రావడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని బాలయ్య హర్షభావం వ్యక్తం చేశారు. పద్మభూషణ్ పురస్కారం తమకే వచ్చినట్లు వారు భావిస్తున్నారని.. అభిమానుల నుంచి ఇంత గొప్ప ప్రేమాభిమానాలను పొందడం తన పూర్వజన్మ సుకృతం బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Next Story