వారి తలలు తీసేస్తాం : బాలయ్య బాబు మాస్ వార్నింగ్

by Muthe.Rajitha |

నటుడు నందమూరి బాలకృష్ణ, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లోకి ఎక్కారు.

వారి తలలు తీసేస్తాం : బాలయ్య బాబు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు నందమూరి బాలకృష్ణ, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లోకి ఎక్కారు. నేడు గుంటూరు జిల్లా తుళ్లూరులో బాలకృష్ణ NTR విగ్రహావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు.

అనంతరం అధికారంలోకి వచ్చిన కొందరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసారని మండిపడ్డారు. సమయం వచ్చినపుడు వారి తాట తీస్తామని హెచ్చరించారు. తమ పార్టీపై, తమపై దుష్ప్రచారం చేసే వాళ్ళ తలలు తీసేస్తామని ప్రత్యర్థులకు బాలయ్య బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story