- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: నిన్ను ఎవడు రమ్మన్నాడు.. అభిమానిపై బాలయ్య చిందులు
టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పుడు చూసినా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. అయితే బాలయ్యకు కోపం రాదు కానీ వస్తే పక్కన ఎవరు ఉన్నా ఇచ్చి పడేస్తుంటారు. తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పుడు చూసినా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. అయితే బాలయ్యకు కోపం రాదు కానీ వస్తే పక్కన ఎవరు ఉన్నా ఇచ్చి పడేస్తుంటారు. తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఏం జరిగిందో కానీ ఎయిర్ పోర్టుకు వచ్చిన అభిమానిపై బాలయ్య చిందులు వేశారు.
నిన్ను ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపో అంటూ మండిపడ్డాడు. సాయంత్రం ఈవెంట్ లో కూడా వాడు కనిపించకూడదు అంటూ సెక్యురిటీకి ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం బాలయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య అఖండ పార్ట్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ లాంచ్ కోసం బాలయ్య వైజాగ్ వెళుతున్నారు. ఈ క్రమంలో బాలయ్య అభిమానిపై రెచ్చిపోయారు.






