జగన్ ఇప్పుడు ఆ మాటంటే వినాలని ఉంది: సీఎంపై బాలయ్య సెటైర్లు

by Disha Web |
జగన్ ఇప్పుడు ఆ మాటంటే వినాలని ఉంది: సీఎంపై బాలయ్య సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత వైసీపీని తొక్కిపట్టి నార తీశారని అన్నారు. ఈ ఫలితాలు ఏపీకి టీడీపీ పాలన ఎంత అవసరమో తెలియజేస్తున్నాయన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడ్డాయని.. ఈ బీటలు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరకుంటాయని బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తాత దిగొచ్చిన దాన్ని కాపాడుకోవటం సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. వైనాట్ 175 అని సీఎం జగన్ ఇప్పుడంటే ఆ మాట వినాలని ఉందని బాలయ్య సెటైర్లు వేశారు. ఇక, టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మె్ల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఇది సైకో పాలనపై ప్రజావిజయం అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు నమస్సులు, విజేతలకు అభినందనలు అని అన్నారు.

ఇవి కూడా చదవండి : అప్పులఅప్పారావు బుగ్గనతో ఆవు కథలు చెప్పిస్తే ప్రజలు నమ్మరు: అచ్చెన్నాయుడుNext Story