- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్ల ఎమ్మెల్యే ప్రాంతీయ విభేదాలు సృష్టించి రెచ్చగొడుతున్నారు...గవర్నర్‌కు టీడీపీ నేత లేఖ
జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తు రెచ్చగొడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోండని గవర్నర్జిష్ణుదేవ్వర్మకు టీ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు,

దిశ, తెలంగాణ బ్యూరో: జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తు రెచ్చగొడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోండని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు టీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంఎల్ఏ బక్కని నర్సింహులు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కోవర్టులు ఉన్నారని వారికి విద్యుత్ కట్ చేయాలని, త్రాగునీరు ఆపాలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనతో పాటు విద్యుత్‌శాఖ మాజీ మంత్రి జీ. జగదీశ్‌రెడ్డి సైతం శాసనసభ్యునిగా ఉంటూ రెండు రాష్ట్రాలలో నీచులు పాలిస్తున్నారంటూ ఇరు ముఖ్యమంత్రులు విమర్శించడం సరి కాదన్నారు. చివరికీ మీడియా సంస్థలను కూడా అహంకారపూరితంగా అరే.. ఒరే.. అంటూ ఏక వచనంతో తిడుతూ అవమానకరంగా మాట్లాడారని బక్కని నర్సింహులు ఆ లేఖలో ప్రస్తావించారు. ఆంధ్రాప్రాంతం అంటూ కించపరుస్తున్న జగదీశ్‌రెడ్డి వారి బంధువులు, తల్లి , ఇల్లాలు ఆంధ్రాప్రాంతంలో ఉన్నారని మర్చిపోవద్దన్నారు.
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువారేనని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో ఏ విధంగా మెలగాలో పలువురు పెద్దలు సూచనలు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కానీ చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బహిరంగంగా మీడియా సమావేశాలలో మాట్లాడుతున్నారని గవర్నర్దృష్టికి తీసుకువెళ్లారు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రాన్ని ప్రజాప్రతినిధులే దుర్వినియోగం చేస్తూ ప్రత్యర్థులపై దూషణలు చేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాప్రతినిధుల పట్ల ఎలా మెలగాలనే విషయాలపై పార్లమెంటరీ ప్రాక్టీసెస్‌లో సూచనలు ఉన్నట్లే ప్రజాప్రతినిధులు, ప్రత్యర్థి ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంగానే విమర్శలు చేసుకోవచ్చని అన్నారు. శాసనసభ్యులు, చట్టాలు చేసే పెద్దలు ఎదుటి వ్యక్తులను మానసికంగా గాయపరిచే విధంగా తూలనాడే విధానం భవిష్యత్ తరాలకు ప్రమాదకరమని బక్కని నర్సింహులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సాంప్రదాయాల నియమావళి మేరకు నడుచుకునే విధంగా చూడాలని కోరుతున్నానని గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.






