దిశపై దుష్ప్రచారం.. టీడీపీ జనసేన పొత్తుపై ఫేక్ క్లిప్పింగ్

by Prasad Jukanti |

ప్రధాన పత్రికలకు ధీటుగా డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న 'దిశ'పై కొంతమంది తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.

దిశపై దుష్ప్రచారం.. టీడీపీ జనసేన పొత్తుపై ఫేక్ క్లిప్పింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన పత్రికలకు ధీటుగా డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న 'దిశ'పై కొంతమంది తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. దిశ డిజిటల్ పేపర్ లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్ లను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజాగా శనివారం ఏపీ డైనమిక్ 2 పీఎం ఎడిషన్ లో టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కు సంబంధించిన వార్తను వెలువరించగా ఈ పేపర్ క్లిప్ ను గుర్తుతెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేశారు. అచ్చం దిశ ఎడిషన్ లో వచ్చినట్లుగానే మార్పులు చేసి టీడీపీ, జనసేన మధ్య పొత్తు పోయినట్లే అంటూ ఫేక్ క్లిప్పింగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియా గ్రూప్ లలో షేర్ చేస్తున్నారు. ఇదంతా దిశ ఎదుగుదలను చూసి ఓర్వలేని శక్తులే ఇలాంటి దుష్టప్రయత్నాలు చేస్తున్నాయని దిశ యాజమాన్యం ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండించింది. దిశ వెలువరిస్తున్న కథనాలకు ప్రజల్లో విశ్వసనీయత ఉండటం వల్లే దిశలో వచ్చిన కథనాలనాలైతే ప్రజలు నమ్ముతారనే కొంత మంది ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి వాటిపై పాఠకులు అప్రమత్తంగా ఉండాలని దిశ యాజమాన్యం కోరుతోంది. ఫేక్ క్లిప్పింగులతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Next Story