TTD News : ఉగ్రదాడి నేపథ్యం... ఆ 400 మందితో టీటీడీ కీలక సమావేశం

by Muthe.Rajitha |

పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, సెంట్రల్ ఇంటలిజెన్స్ అన్ని రాష్ట్రాలకు, పర్యాటక ప్రదేశాలకు, ముఖ్య దేవాలయాలకు హై అలర్ట్స్(High Alerts) జారీ చేసింది.

TTD News : ఉగ్రదాడి నేపథ్యం... ఆ 400 మందితో టీటీడీ కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గామ్ ఉగ్రదాడి(Pahalagam Terror Attack) నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, సెంట్రల్ ఇంటలిజెన్స్ అన్ని రాష్ట్రాలకు, పర్యాటక ప్రదేశాలకు, ముఖ్య దేవాలయాలకు హై అలర్ట్స్(High Alerts) జారీ చేసింది. ఈ క్రమంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని 400 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు, 50 మంది ఓనర్లతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ.. తిరుమల భద్రతలో ఆటో, క్యాబ్ డ్రైవర్లది కీలక పాత్ర అని పేర్కొన్నారు. తిరుమలలో వారు అనుసరించాల్సిన విధానాల గురించి పలు సూచనలు చేశారు. ఆటోల్లో, క్యాబుల్లో పేలుడు పదార్థాలను, అనుమానాస్పద వస్తువులను ఎట్టి పరిస్థితులలోనూ సరఫరా చేయవద్దని తెలిపారు.

అలాంటి వాటిని ఎవరైనా తరలిస్తున్నట్టు అనుమానం కలిగినా, ఎవరైనా అనుమానస్పదంగా సంచరిస్తున్నట్టు గమనించినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. లేదా డయల్ 112 కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరారు. ఒక్కోసారి చిన్న సమాచారమే.. పెద్ద ఉపద్రవం నుంచి ప్రజలను, భక్తులను కాపాడవచ్చని తెలియజేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరూ సోల్జర్ లా పనిచేయాలని విన్నవించారు.

Next Story