- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఏసీ మీట్‌లో కీలక నిర్ణయం.. 30 వరకు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
by Vemula.Srinu Prasad |
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరో 10 రోజుల పాటు జరపాలని బీఏసీ నిర్ణయించింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) మరో 10 రోజుల పాటు జరపాలని బీఏసీ(BAC) నిర్ణయించింది. ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు విషయం తెలిసిందే. అయితే సభను ఎన్ని రోజుల జరపాలనేదానిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సభలో మొత్తం 18 అంశాలు చర్చించాలని ఈ మేరకు మరో పది రోజులు పాటు అసెంబ్లీ జరపాలని నిర్ణయించారు. నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని, అలాగే ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉంటాయని స్పీకర్ తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వివిధ అంశాలపై ప్రశ్నోత్తరాలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు.
Next Story






