- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Baby swap controversy: వారి బిడ్డకు బదులు మరో బిడ్డను ఇచ్చారు.. కేజీహెచ్‌లో శిశువుల మార్పిడి కలకలం..!
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది

దిశ, డైనమిక్‌బ్యూరో/ విశాఖపట్నం: విశాఖపట్నంలోని (visakhapatnam) కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో (kgh)శిశువుల మార్పిడి(Baby swap) ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి గైనకాలజీ వార్డులో ఒక కుటుంబానికి బదులుగా మరొక కుటుంబానికి శిశువును అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు ఆసుపత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాము తమ నిజమైన శిశువును తిరిగి పొందే వరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. దీంతో గైనకాలజీ (gynecology) వార్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్శివానంద్ స్పందించారు. సదరు మార్పిడి ఎలా జరిగింది? ఎవరి వైఫల్యమో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే సీసీటీవీ ఫుటేజీ(cc tv footage) ఆధారంగా అసలు విషయం వెలుగులోకి తేవాలని తెలిపారు. వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై నివేదిక కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు సామాజిక సంస్థలు స్పందించాయి. విచారణ ఫలితాన్ని ఆధారంగా తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి వర్గాలు హామీ ఇచ్చాయి.






