రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు.. పర్యాటక క్యారవాన్లు ప్రారంభం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-27 07:34:51  IST  )

రాష్ట్రంలో బాబా రామ్ దేవ్‌ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు వేశారు..

రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు.. పర్యాటక క్యారవాన్లు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్:రాష్ట్రంలో పెట్టుపెడుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర పర్యాటకాన్ని సైతం అధివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కీలక అడుగులు వేశారు. విజయవాడ‌లో జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాన్ క్లేవ్‌లో భాగంగా నడిచే పర్యాటక క్యారవాన్ల(Tourist caravans)ను యోగా బాబా రామ్ దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

కాగా రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా జీఎఫ్ఎస్టీ టూరిజం శాఖ పని చేస్తోంది. ఈ మేరకు పర్యటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించారు. రూ. 10,039 కోట్ల పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోనున్నారు. దీంతో విశాఖతో పాటు తిరుపతి, విశాఖ, అమరావతిలో హోటళ్లను నిర్మించనున్నారు.

Next Story