YS జగన్ తప్ప మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు.. స్పీకర్‌ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలకు సిద్దమవుతున్నారు.

YS జగన్ తప్ప మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు.. స్పీకర్‌ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) చర్యలకు సిద్దమవుతున్నారు. రాజ్యాంగ బద్దంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తామన్నారు. మాజీ సీఎం, వైఎస్ జగన్‌ (Jagan) మినహా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నామని, ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పుకొచ్చారు. అటువంటిది ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అసలు కోడికి గుడ్డు కి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఆయన మండిపడ్డారు.

Next Story