- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అయ్యా నారాయణ.. పాకిస్థాన్‌కే వెళ్లిపో! ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌పై పాక్ విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతోన్న వేళ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ‘మన యుద్ధం పాకిస్థాన్ ప్రజల మీద కాదు.. టెర్రరిజంపై అంటూ ఆయన ఇటీవలే కామెంట్ చేశారు. భారత్ పాక్‌పై కాల్పులు జరిపి అక్కడున్న సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని అన్నారు. పాకిస్థాన్‌కు చైనా సపోర్ట్ చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
తాజాగా, నారాయణ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో స్పందించారు. పహల్గాం టెర్రర్ అటాక్‌తో దేశం శోకసంద్రంలో మునిగిపోయిందని, అంతటి ఘోరం జరిగితే పాకిస్థాన్‌పై యుద్ధం చేయొద్దని చెప్పడం ఏంటని ఫైర్ అయ్యారు. పాక్ ప్రజలపై నారాయణకు అంత ప్రేమే ఉంటే.. తట్టబుట్ట సదురుకుని పాకిస్థాన్‌కే వెళ్లిపోవాలని ధ్వజమెత్తారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన నారాయణను వెంటనే సీపీఐ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.