- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ayodhya Rami Reddy : వైసీపీకి రాజీనామాపై అయోధ్య రామిరెడ్డి క్లారిటీ !
వైసీపీ(YSRCP)రాజీనామా (Resignation)చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి(Ayodhya Rami Reddy)క్లారిటీ(Clarity) ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ(YSRCP)రాజీనామా (Resignation)చేయబోతున్నారన్న ప్రచారాన్ని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి(Ayodhya Rami Reddy)క్లారిటీ(Clarity) ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డిని కలిసిన మీడియా ప్రతినిధులు మీరు వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అయోధ్య రామిరెడ్డి నా రాజీనామాపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని.. అదంత తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు.
తాజాగా వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. విజయసాయిరెడ్డి బాటలోనే వైసీపీకి చెందిన మరో ఇద్ధరు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలు కూడా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పిస్తారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. పిల్లి, ఆళ్లలు ఇద్దరూ కూడా నిన్నటిదాకా ఢిల్లీలోనే ఉండిపోవడంతో వారి రాజీనామాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వారు వైసీపీలోనే కొనసాగుతారని తిరుపతి ఎంపీ గురుమూర్తి సహా ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. తాజాగా అయోధ్య రామిరెడ్డి సైతం తన రాజీనామా వార్తలను ఖండించడం విశేషం. అయితే ఢిల్లీ ఆపరేషన్ లో భాగంగా ఎన్డీఏ వ్యూహాం మేరకు రాజ్యసభలో వారి బలం పెంచుకునే క్రమంలో వైసీపీ సభ్యులు రాజీనామా చేయడం తధ్యమన్న ప్రచారం కొనసాగుతునే ఉండటంతో వైసీసీ రాజ్యసభ సభ్యుల రాజీనామా వ్యవహారంలో ఉత్కంఠత కొనసాగుతోంది.






