- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీబీఐ తుది నివేదిక పరిశీలించాలి..హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్
ఆయేషా మీరా హత్యపై సీబీఐ తుది నివేదికను పరిశీలించాలని ఆమె తల్లిదండ్రులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ తుది నివేదికను తమకు అప్పగించేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆయేషా మీరా హత్యపై సీబీఐ తుది నివేదికను పరిశీలించాలని ఆమె తల్లిదండ్రులు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ తుది నివేదికను తమకు అప్పగించేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే 2007లో ఇబ్రహీంపట్నంలోని లేడీస్ హాస్టల్‌లో ఆయేషా అత్యాచారం హత్యకు గురైంది. ఈ కేసులో 150 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వదివేశారు. 2008లో సత్యంబాబు అనే యువకుడిని అరెస్ట్ చేశారు.
విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. కానీ ఆయేషా తల్లిదండ్రులు సత్యంబాబు నింధితుడు కాదని వాదించారు. మరోవైపు 2017లో హైకోర్టు సత్యంబాబు నిర్దోషి అని తేల్చి కేసును కొట్టివేసింది. విచారణ సరిగ్గా జరగలేదని దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది.
సిట్ విచారణ సైతం సక్రమంగా సాగకపోవడంతో ఆయేషా తల్లి హైకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీబీఐకి కేసును అప్పగించింది. ఆధారాలు ధ్వంసం అయ్యాయని సిట్ అధికారులు కోర్టుకు తెలపడంతో విచారణకు ఆదేశించింది. దీంతో 2018లో సీబీఐ మరోసారి దర్యాప్తు ప్రారంభించింది. ఏడేళ్ల పాటు సీబీఐ దర్యాప్తు జరగ్గా అధికారులు ఏం తేల్చారు అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలోనే సాక్ష్యాలు తారుమారైన నేపథ్యంలో ఆయేషా తల్లిదండ్రులు ఇప్పుడు సీబీఐ తుది నివేదికను తమకు అప్పగించాలని కోరుతున్నారు.






