- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్య కేసులో .. అవినాష్ రెడ్డే మాస్టర్ మైండ్.. సుప్రీంకోర్టులో సునీత తరఫు లాయరు వాదన
వేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కే. సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

సుప్రీంకోర్టులో సునీత తరఫు లాయరు వాదన
తదుపరి విచారణ వచ్చే నెల 9 కి వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో : వివేకా హత్యకేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కే. సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరపు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందన్నారు. వివేకా హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది, నిందితులు సాక్ష్యులను బెదిరించడమే కాకుండా సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, సునీత దంపతులతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్ పైనా కేసు పెట్టారని తెలిపారు. అవినాష్ రెడ్డే వివేకా హత్య కేసులో మాస్టర్ మైండ్ అని సిద్ధార్థ లూథ్రా వివరించారు. వివేకా కుమార్తె, అల్లుడు నెర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తాని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపింసూత నిందితులను కాలపరిమితి లేకుండా జైలులో ఉంచడం మంచిది కాదన్నారు. అన్ని వివరాలు దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. కాగా దర్యాప్తులో నింది తులకు కస్టోడియల్ విచారణ చేయాలో చెప్పాలని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది. 8 మంది నిందితుల బెయిలు రద్దు చేయాలో లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించింది.






