డెంగ్యూ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలి: మంత్రి అనగాని

by Yella Dhawani Reddy |

రాష్ట్రంలో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

డెంగ్యూ కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలి: మంత్రి అనగాని
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా (Bapatla) నగరం మండలంలో డెంగ్యూ లక్షణాలతో దంపతులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) పరిస్థితిని సమీక్షించారు. అనంతరం డెంగ్యూ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దోమలు పెరిగే ప్రాంతాలను గుర్తించి శుభ్రపరిచే కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, పాత డబ్బాలు, చెత్తబుట్టలు, తులసి కుండీలు వంటి వాటిని శుభ్రంగా ఉంచాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. మున్సిపల్ అధికారులు, ఆరోగ్య శాఖ, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అలాగే, అధికారులు డెంగ్యూ నియంత్రణ కోసం గ్రామ, పట్టణ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, లక్షణాలు కనిపించిన వ్యక్తులకు వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని మంత్రి సూచించారు.

Next Story