- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టూరిస్టులకు బిగ్ షాక్.. 6 బీచ్‌లు మూసివేత
దిత్వా తుపాను ఏపీపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆరు బీచ్ లను అధికారులు మూసివేశారు..

దిశ, వెబ్ డెస్క్: దిత్వా తుపాను(Ditva Cyclone) ఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorology Department) తెలిపింది. దీంతో పలు ప్రాంతాలకు అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కోస్తా తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులు పలు బీచ్‌లు మూసి వేయాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
డిసెంబర్ 2 వరకు సముద్ర స్నానాలు తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌ల వద్ద ఆంక్షలు విధించారు. చీరాల బీచ్‌లకు పర్యాటకులు రావొద్దని అధికారులు ప్రకటించారు. అటు మత్స్యకారులు సైతం వేటకు వెళ్లొద్దని సూచించారు. బీచ్‌ల వద్ద బందోబస్తును పెంచారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీంతో టూరిస్టులకు బిగ్ షాక్ తగిలింది. బీచ్‌లో సరదాగా గడుపుదామనుకున్న వారికి అధికారుల హెచ్చరికలు నిరాశను మిగిల్చాయి. చేసేదేమీ లేక వచ్చిన దారినే వెళ్లిపోతున్నారు.






