తిరుపతిలో ఆటోవాలా దందాకు చెక్... టోకెన్ల జారీపై సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-04 05:08:31  IST  )

తిరుపతిలో ఆటోవాలాల దందాకు అధికారులు చెక్ పెట్టారు...

తిరుపతిలో ఆటోవాలా దందాకు చెక్... టోకెన్ల జారీపై సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి దివ్య దర్శనం టోకెన్లు(Lord Srivari Divya Darshan Tokens) ఇప్పిస్తామంటూ తిరుమల(Tirumala)కు వచ్చిన భక్తులను తిరుపతి(Tirupati)లో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు డబ్బులు దోచుకుంటున్నారు. అలిపరి రోడ్డుమార్గంలో భక్తులే టార్గెట్‌గా దందా నిర్వహిస్తున్నారు. దీంతో టీటీడీకి పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. నడకదారి భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. టోకెన్ల పంపిణీ కేంద్రం అలిపిరి నుంచి మార్పు చేశారు. శుక్రవారం నుంచి భూదేవి కాంప్లెక్స్‌లో రోజూ 5 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. 1200వ మెట్టు దగ్గర తప్పనిసరి స్కానింగ్ ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story