- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో వ్యాపారులకు బిగ్ షాక్.. ఆ మఠం కూల్చివేతకు రెడీ
తిరుమలలో హథీరాం బావాజీ మఠం కూల్చివేతకు అధికారులు రెడీ అవుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirupmala)లో హథీరాం బావాజీ మఠం(Hathira Bawaji Math) కూల్చివేతకు అధికారులు రెడీ అవుతున్నారు. పురాతన నిర్మాణం కావడంతో కూల్చివేయాలని నిర్ణయం తీసున్నారు. ఈ మేరకు కూల్చివేత పనులకు టెండర్లు వేశారు. రూ. 1.50 వేలకు కూల్చివేసేందుకు టెండర్ ఫైనల్ అయింది. అలాగే ఈ నిర్మాణానికి చెందిన పురాతన కలపతో పాటు పని కొచ్చే సామాగ్రీని తీసుకునేందుకు రూ. 90 లక్షల వరకూ టెండర్ ఖరారు అయింది. అయితే ఈ భవనాన్ని కూల్చివేస్తే తమ బతుకుదెరువు పోతోందని వ్యాపారులు చెబుతున్నారు. రూ. 7 అద్దె నుంచి రూ. 25 వేల వరకూ చెల్లిస్తున్నామని, ఇప్పుడు సెడన్‌గా ఈ భవనాన్ని కూల్చివేస్తామంటూ తమ ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే హథీరాం బావాజీ మఠాన్ని కూల్చివేస్తామని అధికారులు తెలిపారు. అయితే వ్యాపారులు మాత్రం అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






