వైసీపీ నేత తురక కిషోర్‌పై హత్యాయత్నం కేసు.. హరినాథ్‌రెడ్డిని అరెస్ట్‌

by Malleboina Mahesh |

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో టీడీపీ నేతలపై దారుణమైన దాడులు జరిగిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ నేత నాగేశ్వరరావుపై ఆయన ప్రత్యర్థులు దాడి చేశారు.

వైసీపీ నేత తురక కిషోర్‌పై హత్యాయత్నం కేసు.. హరినాథ్‌రెడ్డిని అరెస్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో టీడీపీ నేతలపై దారుణమైన దాడులు జరిగిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ నేత నాగేశ్వరరావు (Nageswara Rao)పై ఆయన ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకున్న నాగేశ్వరరావు అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు చేరుకోని.. ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం పోలీసులు నాగేశ్వరరావును గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే టీడీపీలో తిరగవద్దని వైసీపీ నేతలు ఈ దాడి చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులపై విచారణ ప్రారంభం అయింది. ఈ క్రమంలో ఈ నెల 23న నాగేశ్వరరావు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దాడిలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నేత తురక కిషోర్‌ (Turaka Kishore)పై హత్యాయత్నం (Attempted murder) కేసు నమోదు చేశారు. 2023 దాడిలో కిషోర్‌, హరినాథ్‌రెడ్డి మారణాయుధాలతో దాడి నాగేశ్వరరావుపై దాడికి పాల్పడినట్లు ఎవిడెన్స్ దొరికాయి. దీంతో హరినాథ్‌రెడ్డిని అరెస్ట్‌ (Harinath Reddy arrested) చేసిన పోలీసులు కోర్టులో హజరు పరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను వెంటనే జైలుకు తరలించారు.

Next Story