- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాడులు దౌర్జన్యాలే.. వైసీపీ డీఎన్‌ఏ
దాడులు, దౌర్జన్యాలు, వినాశనాలు, అవినీతి వైసీపీ డీఎన్ఏలోనే ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు

దాడులు దౌర్జన్యాలే.. వైసీపీ డీఎన్‌ఏ
వారికి ఓటమి భయం పట్టుకుంది
ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు
హోం మంత్రి వంగలపూడి అనిత
దిశ డైనమిక్ బ్యూరో : దాడులు, దౌర్జన్యాలు, వినాశనాలు, అవినీతి వైసీపీ డీఎన్ఏలోనే ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆమె సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పులివెందులలో వైసీ పీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్ ఓడిపోగానే ఆరోజు ఈవీఎంల తప్పు అని చెప్పాడని గుర్తు చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఎలక్షన్ కమిషన్ ఏవిధంగా పని చేస్తుందనే విషయం సైతం క్లారిటీ లేదన్నారు. పులివెందులలో ఏదో జరుగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. విలువలు పాటించని జగన్ విలు వలు గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో పులివెందులలో ఎప్పుడు ఏకగ్రీవంగా జరిగేవి, ప్రశాంతంగా జరగకుండా గతంలో భయపెట్టి ఏకగ్రీవం చేసుకున్నారని, ఈనాడు ప్రజాస్వామ్య బద్దంగా ఉప ఎన్నికలు జరుగు తున్నా యని తెలిపారు. తల్లి, చెల్లి ఆస్తుల కోసం కోర్టుకెక్కిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. పులివెందులలో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారన్నారు. హెల్ప్ డెస్క్, ఓటర్లకి వెహికల్స్ ఉంచడం, పోలీస్ బందోబస్త్ నిర్వహించటం జరుగుతుందన్నారు.
పులివెందుల ఎలక్షన్‌లో అవినాశ్‌రెడ్డి, జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్న మాదిరి జగన్‌కి అలాగే కనిపిస్తాయని అన్నారు. ఒక్క పులివెందులలోనే 11నామినేషన్లు వచ్చాయని తెలిపారు. ఎక్కడ అవకతవకలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉప ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. దొంగ ఓట్ల ను తెచ్చేది, ఓటర్లును బయపెట్టేది, రీసైక్లింగ్ కు పాల్పడేది వైసీపీ.. అని అన్నారు. ఎక్క డా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే పోలీసులు పోలింగ్ బూత్‌లను మారుస్తున్నారని తెలిపారు. పట్టభద్రుల ఎన్నిక ల సమయంలో 10వ తరగతి విద్యార్థులతో ఓట్లు వేయించిన ఘన త గత ప్రభుత్వానిదేనన్నారు. రాఖీ పండగ రోజు వైసీపీ అధినేతకు కనీసం ఒక్క చెల్లి సైతం రాఖీ కట్టలేదు ఎందుకని పేర్కొన్నారు. సీఎంగా పనిచేసిన జగన్ కు , ఎంపీగా పని చేసిన అవినాశ్ కు ఎన్నికల సంఘం విధులు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నామినేషన్లను సైతం వేయకుండా అడ్డుకుని చించి వేసిన చరిత్ర వారిదన్నారు. తమ ప్రభుత్వం లో పులివెందులలో తొలిసారి 11 నామినేషన్లు పడ్డాయంటే కూటమి ప్రభుత్వం ఎంత పార దర్శకంగా ఉందో అర్థం అవుతుందని తెలిపారు. పులివెందులలో వైసీపీ ఓడి పోతుంది కాబట్టి అంత హడావుడి చేస్తోందన్నారు.






