ముద్రగడ ఇంటిపై దాడి.. మద్యం మత్తులో యువకుడి హల్చల్

by Thanuru Gopichand |

కిర్లంపూడిలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఈ ఉదయం గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు.

ముద్రగడ ఇంటిపై దాడి.. మద్యం మత్తులో యువకుడి హల్చల్
X

దిశ డైనమిక్ బ్యూరో: కిర్లంపూడిలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఈ ఉదయం గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మద్యం మత్తులో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున గంగాధర అనే యువకుడు ముద్రగడ ఇంటి వద్ద బీభత్సం సృష్టించాడు. ట్రాక్టర్ ను నడుపుకుంటూ వెళ్లి ఆయన ఇంటి గేటును ఢీకొట్టాడు. ఆ సమయంలో జై జనసేన అనే నినాదాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి బయట శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు బయటికి వచ్చి చూడగా యువకుడు హల్చల్ చేయడం కనిపించింది. ట్రాక్టర్ తో ఇంటి బయట ఉన్న కారును కూడా ఆ యువకుడు ధ్వంసం చేశాడు. ఫ్లెక్సీలను విరగ్గొట్టాడు. స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తెలిపే పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story