- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి.. బయటపడిన కోడికత్తి
సంక్రాంతి (Sankranti) సమీపిస్తుండడంతో ఏపీలో కోడి పందాలు (Kodi Pandalu) జోరందుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి (Sankranti) సమీపిస్తుండడంతో ఏపీలో కోడి పందాలు (Kodi Pandalu) జోరందుకున్నాయి. నిర్వాహకులు పెద్ద ఎత్తున సరంజామాను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కోడి కత్తులకు (Kodi Kathi) ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. వాటిని గుట్టుగా విక్రయించేందుకు ప్రణాళికలను కూడా రచించుకొని అమలు చేస్తున్నారు. అయితే కోడి పందాలకు అనుమతి లేదని.. వాటిని అనుమతించబోమని పోలీసు శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. తరచూ తనిఖీలను నిర్వహిస్తూ కోడి పందాలను నిలువరించే ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేసింది. పోలీసుల వివరాల ప్రకారం తాజాగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. విస్సన్నపేటలోని వికాస్ నగర్ లో కోడి పందాల కోసం భారీ స్థాయిలో కోడి కత్తులను సిద్ధం చేసినట్లు ఉప్పందుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. వారి తనిఖీల్లో సుమారు వెయ్యికిపైగా కోడి కత్తులు బయటపడ్డాయి. వాటితో పాటు తయారీ యంత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




