- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతికి బ్లాక్ మెయిల్.. బోరు బావిలో ముక్కలుగా యువకుడి మృతదేహం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన యువకుడు ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యాడు...

దిశ, వెబ్ డెస్క్: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం(Yarragondapalem)లో కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన యువకుడు ఆంజనేయులు దారుణ హత్య(Murder)కు గురయ్యాడు. మే 13న అదృశ్యమై యువకుడి కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. అయితే ఆ యువకుడు ప్రాణాలతో లేడనే చేదు నిజం వెలుగులోకి వచ్చింది. పాత పరిచయాలు, వ్యక్తిగత వివాదాల నేపథ్యంలోనే ఈ దారుణం చోటు చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ప్లాన్ ప్రకారం హత్య
యువతికి సంబంధించిన పాత వీడియోలను చూపిస్తూ ఆంజనేయులు కొంతకాలంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై సదరు యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం పెంచుకున్నారు. ఈ క్రమంలో యువతి ద్వారా ఆంజనేయులును రాత్రి సమయాల్లో ఇంటికి పిలిపించారు. అక్కడ యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. అనంతరం నేరాన్ని పక్కదారి పట్టించేందుకు యువకుడి మృతదేహాన్ని కత్తితో ముక్కలుగా నరికి, ఆనవాళ్లు దొరకకుండా సమీపంలోని పొలం బోరుబావిలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






