AP Crime News : వైజాగ్ లో దారుణం.. నిండు గర్భిణీని హత్య చేసిన భర్త

by Muthe.Rajitha |   (  Updated:2025-04-14 10:42:13  IST  )

ఏపీ(AP)లోని వైజాగ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

AP Crime News : వైజాగ్ లో దారుణం.. నిండు గర్భిణీని హత్య చేసిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని వైజాగ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండు చూలాలు అని కూడా చూడకుండా స్వయంగా కట్టుకున్న భర్తే ఆమె ప్రాణం తీశాడు . విశాఖపట్నం(Vishakhapatnam)లోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న అనూష, జ్ఞానేశ్వర్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య పెళ్లైన నాటి నుంచే గొడవలు జరుగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా సఖ్యతతో ఉన్న జ్ఞానేశ్వర్.. అనూష గర్భవతి అనే విషయం తెలిసినప్పటి నుంచి మళ్ళీ గొడవ పడటం మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో నేడు మరోసారి వారిమధ్య మాటా మాటా పెరిగి, గొడవ తీవ్రమయ్యి.. ఆగ్రహంతో జ్ఞానేశ్వర్ 9 నెలల గర్భవతి అని కూడా చూడకుండా గొంతునులిమి హత్య చేశాడు. ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి, తన భార్యకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో.. వారు హుటాహుటిన ఇంటికి చేరుకొని, ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే శిక్ష తప్పదని భావించిన నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని, విచారణ జరుపుతున్నారు.

Next Story