సత్యసాయి జిల్లాలో దారుణం.. గర్భిణిపై దాడి

by Thanuru Gopichand |   (  Updated:2025-12-22 03:38:03  IST  )

శ్రీసత్యసాయి జిల్లాలో (Sri Sathyasai District) దారుణం చోటు చేసుకుంది. ఓ గర్భిణిపై అమానుషంగా (Attack on Pregnant) దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

సత్యసాయి జిల్లాలో దారుణం.. గర్భిణిపై దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీసత్యసాయి జిల్లాలో (Sri Sathyasai District) దారుణం చోటు చేసుకుంది. ఓ గర్భిణిపై అమానుషంగా (Attack on Pregnant) దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీసత్యసాయి జిల్లాలోని తనకల్లు మండల పరిధిలో ఉన్న ముత్యాలవాండ్లపల్లిలో ఈ దురదృష్ణకర ఘటన జరిగింది. గ్రామంలో వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. అందులో భాగంగా వైసీపీ కార్యకర్తలు గుమ్మిగూడి సంబరాలను జరుపుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని వీధుల్లో పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు. అదే గ్రామానికి చెందిన సంధ్యారాణి బాణాసంచ కాల్చొద్దని వారిని వారించింది. బాణాసంచ కాల్చడం వల్ల ఇబ్బంది కలుగుతోందని వారికి చెప్పే ప్రయత్నం చేసింది. సంధ్యారాణి మాటలను వారును చెవిన ఎక్కించుకోక పోగా ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ చెలరేగింది. విచక్షణకు కోల్పోయిన ఓ వైసీపీ కార్యకర్త సంధ్యారాణిపై దాడికి తెగబడ్డాడు. గర్భిణి అనే విచక్షణ కూడా లేకుండా దాడి చేశాడు. దీంతో సంధ్యారాణి తీవ్రంగా గాయపడింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆమెను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్త తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ గా పోలీసులు గుర్తించారు.

Next Story