జగ్గయ్యపేటలో దారుణం.. వాగులో యువతి మృతదేహం

by Thanuru Gopichand |

ఇటీవల పెరిగిపోతున్న నేరాలు ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాష్టీకాలు సమాజంలో వారి భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

జగ్గయ్యపేటలో దారుణం.. వాగులో యువతి మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల పెరిగిపోతున్న నేరాలు ప్రజల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాష్టీకాలు సమాజంలో వారి భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మానవత్వ విలువలు ఇంతలా దిగజారాయా అనిపించేలా జరిగే కొన్ని నేరాలు.. మనసులను కలచివేస్తున్నారు. అటువంటి ఓ దురదృష్టకర సంఘటన ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది. మంగోలు రోడ్డులోని వాగులో ఓ మృతదేహం కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అది యువతి మృతదేహంగా పోలీసులు గుర్తించారు. యువతిని చంపి కాళ్లు, చేతులు కట్టి మృతదేహాన్ని దుండగులు వాగులో పడేసినట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story